పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు ప్రాంతంలో స్థానికుల అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది. లక్ష్మిసాయి సెల్ పాయింట్ పేరుతో మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ దుకాణం నిర్వాహకుడి కామపురాణం బయటపడింది.
వివిధ పనుల నిమిత్తం అతని దగ్గరకు వచ్చే మహిళలు, యువతులకు మాయామాటలు చెప్పి ట్రాప్ చేసేవాడు. వారితో చనువు పెంచుకొని.. ఏకాంతంగా గడిపిన సమయంలో రహస్యంగా వీడియోలు తీశాడు. అయితే అతని దగ్గర ఫోన్ రిపేరింగ్ నేర్చుకోవడానికి వచ్చిన ఓ యువకుడు.. సదరు యజమాని ఫోన్‌లోని అశ్లీల చిత్రాలను చూసి కంగుతిన్నాడు.
యజమాని ఫోన్‌లో ఆ వీడియోలు చూసిన యువకుడు క్రమక్రమంగా తన ఫోన్‌లోకి పంపించుకున్నాడు. అలా ఆ వీడియోలను తాను చూడటమే గాకుండా.. స్నేహితులకు పంపించాడు. అలా ఒకరి నుంచి మరొకరికి షేర్ అవుతూ సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారాయి.
నెమ్మదిగా వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టాయి. ఆ క్రమంలో స్థానికంగా ఆ వీడియోలు దుమారం రేపాయి. తెలిసిన మహిళల మొఖాలు ఆ వీడియోల్లో కనిపించడంతో చాలామంది షాక్‌కు గురయ్యారు. చివరకు ఆ వీడియోలు బాధితుల ఫోన్లకు చేరడం మొదలైంది. అయితే చాలామంది ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. అందులో ఒక బాధితురాలు మాత్రం ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించారు. దాంతో సదరు సెల్‌ఫోన్ పాయింట్ నిర్వాహకుడి బాగోతం వెలుగుచూసింది. షాపు యజమానితో పాటు అందులో పనిచేస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి ఫోన్లను సీజ్ చేశారు.
అయితే అతడి చేతిలో చాలామంది మహిళలు బలయ్యారని తెలుస్తోంది. ఆ మేరకు నిందితుడిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
mobile shop owner sexual relationship with customers