పూరీ జగన్నాథుని ఆలయంలో అంతుచిక్కని రహస్యాలివే

మన దేశంలోని హిందూ ఆలయాల్లో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని అనేక ఆలయాలలో ఇలాంటి రహస్యాలను మనం గమనిస్తూ ఉంటాము.

తమిళనాడులోని చిదంబరం, ఆంధ్రప్రదేశ్లోని హంపి కేరళలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాల్లో ఇప్పటికీ ఎవరికీ తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అలాగే దక్షిణ భారతదేశంలోని ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న పూరి జగన్నాథ్ ఆలయం లో అనేక రహస్యాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అద్భుతంగా చెక్కిన చిత్ర కళలు తో అరవై ఐదు అడుగుల ఎత్తైన పిరమిడ్ ఆకారం నిర్మాణం కృష్ణుని జీవితాన్ని కట్టినట్టు చూపించే గోడలు, స్తంభాలు ఇది పూరి జగన్నాథుని ఆలయం నిర్మాణం. ఈ ఆలయాన్ని సుమారు 1070 వ సంవత్సరంలో నిర్మించారు, అయితే ఈ ఆలయంలో కూడా అన్ని ఆలయాల మాదిరిగానే గోపురం, దేవుడు, గంటలు, ప్రసాదం అన్ని ఉన్నప్పటికీ అన్నిటికంటే ప్రత్యేకమైనది విభిన్నమైనది క్షేత్రం. ఈ ఆలయ గోపురం పై భాగం పై 20 అడుగుల ఎత్తు కన్ను పైన బరువు ఉండేలా ఒక సుదర్శనచక్రాన్ని ఏర్పాటు చేశారు. పూరీ పట్టణం లో ఏ మూల నుంచి చూసినా సుదర్శన చక్రం కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏ మూలను చూసినా ఏ దిక్కు నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం అభిముఖంగా అనే కనిపిస్తూ ఉంటుంది ఒక రహస్యం.

ఈ సుదర్శన చక్రం పైభాగాన లాడుతూ ఎగిరే ఒక జెండా ఉంటుంది. ఈ జెండా సాధారణ జెండాల మాదిరి కాకుండా గాలికి వ్యతిరేక దిశలో ఊగుతూ ఉంటుంది. ఇది అలా ఎందుకు గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది అనేది ఇప్పటికీ సైన్స్కు అందని రహస్యమే.

అరవై ఐదు అడుగుల ఎత్తు ఉన్న పూరి జగన్నాథ్ ఆలయ గోపురం నీడ ఏ సమయంలోనూ కనపడదు అది పగలైనా రాత్రయినా, ఇది ఆలయ నిర్మాణం వల్ల లేక దేవుని లీల వలన అనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్య మే.

పూరి జగన్నాథ్ ఆలయ పరిసర ప్రాంతాల్లో పక్షులు అసలు ఎగరవు. అది ఎందుకు అనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. ఈ పరిసరప్రాంతాలు నో ప్లేయింగ్ జోన్ అయినందువలన ఫ్లైట్స్ కూడా ఎగరవు. ఇక్కడ ఏదో అతీత శక్తి ఉందని ప్రజలందరూ నమ్ముతారు. అందువల్లనే దీనిని ఫ్లయింగ్ జోన్ గా పరిగణించినట్లు పెద్దలు చెబుతారు. ఇప్పటికీ దీనికి ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేదు.

సాధారణంగా సముద్రతీర ప్రాంతంలో పగటిపూట సముద్రం మీద నుంచి గాలి భూమి మీదకి అలాగే రాత్రిపూట భూమి మీద నుంచి గాలి సముద్రం మీదకు ఇస్తూ ఉంటుంది. పురిలో మాత్రం దీనికి వ్యతిరేకంగా గాలి వీస్తుండటంతో ఇక్కడ ప్రత్యేకత.

సముద్రం ఒడ్డున ఉన్న ఉన్న ఈ ఆలయం లోకి ప్రధాన ద్వారం గుండా ఒక్కసారి లోపలికి ప్రవేశించగానే సముద్రపు అలల హోరు వినపడదు. అడుగు బయటకు పెట్టగానే అలల ఘోష చాలా క్లియర్గా వినబడుతూ ఉంటుంది. అది ఎందుకు అనేది ఇప్పటికీ రహస్యమే. అయితే జగన్నాధుని సోదరి సుభద్రాదేవి ఆలయంలోపల ప్రశాంతత కావాలని కోరడం వలన అలా జరుగుతుంది అని ఆలయ పూజారులు చెప్తూ ఉంటారు. జగన్నాధుని ఆలయానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి అందులోని ప్రధాన ద్వారం నుండి బయటకు వెళ్ళినప్పుడు అలల శబ్దాన్ని, అలాగే లోపలికి వచ్చినప్పుడు ప్రశాంతమైన ఎలాంటి సౌండ్ లేని వాతావరణాన్ని మీరు గమనించవచ్చు. ఇది ఎందుకు అనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం.