ఆయుర్వేదంలో మారేడు దళాలు ఉపయోగాలు

ఆయుర్వేదంలో మారేడు దళాలు ఉపయోగాలు

వేడిని తగ్గించే మారేడు..
మారేడు ఆకులతో శరీరంలోని వేడిని తగ్గించొచ్చు. ఇందుకోసం మారేడు పండు గుజ్జుని మెంతులతో కలిసి దంచాలి. అయితే, ముందుగా మెంతులను నానబెట్టాలి. అప్పుడు మంచిగా పేస్ట్‌లా అవుతుంది. ఇలా తయారైన పేస్ట్‌ని తలకి ప్యాక్‌లా వేసి తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల ఒంట్లోని వేడి తగ్గడమే కాకుండా జుట్టు సమస్యలు కూడా దూరం అవుతాయి.

కడుపులోని అల్సర్స్, పురుగులు తగ్గిపోతాయి

మారేడు పండు గుజ్జుని కూడా నేరుగా తినొచ్చు. దీని వల్ల కడుపులోని అల్సర్స్, పురుగులు తగ్గిపోతాయి. అందుకే వీటిని అనేక ఆయుర్వేద మందుల తయారీల్లో వాడతారు. కాబట్టి వీటిని నేరుగా తీసుకోవచ్చు..

అమీబియాస్ మూలాలతో సహా మాయం చేయగలదు

తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోయినా లేదా ఆహారం తీసుకున్న వెంటనే విరేచనానికి వెళ్ళవలసి వచ్చినా, మలబద్దక సమస్యతో బాధపడినా గ్యాస్ పెరగడం, పేగు పూత, కడుపు నొప్పి, నీరసం, నిస్సత్తువ ఇవన్నీ అమీబియాస్ వ్యాధి లక్షణాలు. ఇన్ని లక్షణాలు ఉన్న అమీబియాస్ ను మారేడు మూలాలతో సహా మాయం చేయగలదు అంటే ఇది ఎంత ప్రభావం కలిగినదో అర్థం చేసుకోవచ్చు.

బీపీ, షుగర్ కంట్రోల్‌లో కషాయం
మారేడు కషాయం బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఆ కషాయాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం.. ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో ఓ గ్లాసు నీటిని పోయండి. అందులో ఓ ఐదారు మారేడు ఆకులు వేసి ఓ 5 నిమిషాల పాటు ఆ నీటిని మరిగించండి. ఆ తర్వాత గిన్నెపై మూత పెట్టి ఓ 5 నిమిషాల పాటు అలానే ఉంచండి.. ఇలా కషాయం తయారవుతుంది. దీనిని టీలా తాగొచ్చు. అయితే, ఇందులో మీ అభిరుచికి తగ్గట్లుగా తియ్యగానైనా, ఉప్పగా అయినా తీసుకోవచ్చు. అదెలా అంటే తయారైన కషాయంలో కొద్దిగా ఉప్పు, నల్ల మిరియాల పొడి కలిపి తాగొచ్చు. అలా కాదంటే తాటిబెల్లం, తేనెతో కలిపి తాగొచ్చు.


ఇలా రెగ్యులర్‌గ తాగుతుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ కషాయం తాగడం వల్ల బీపీ, షుగర్, వైరల్ ఫీవర్ వంటివి కూడా దూరం అవుతాయని చెబుతున్నారు. కాబట్టి రెగ్యులర్‌గా తాగండి..