మరోసారి మహేష్ టాలివుడ్ మోనగాడు

ఫోర్బ్స్ జాబితాలో  గడచిన మూడేళ్లుగా టాలీవుడ్ లో టాప్ స్టార్ గా నిలుస్తున్న హీరో … సూపర్ స్టార్ మహేష్ బాబు . ఫోర్బ్స్ జాబితాలో మరోసారి టాలీవుడ్ టాప్ ర్యాంకింగ్ సాధించాడు. భారతీయ సెలెబ్రిటీల్లో టాప్ -100 జాబితాను ప్రముఖ ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది. ఈ జాబితాల్లో పలువురు టాలీవుడ్ తారలకు స్థానం దక్కింది.  2016 ఫోర్బ్స్ పత్రిక మహేష్ బాబుకు 33వ ర్యాంక్ ఇచ్చింది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మహేష్ కంటే మూడు ర్యాంకులు ముందు అంటే 30వ స్థానంలో ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి మహేష్ తరువాతి స్థానంలో అల్లు అర్జున్ ఉన్నాడు. స్టైలిష్ స్టార్ కి ఫోర్బ్స్ ఇచ్చిన ర్యాంక్ 43. ఆ తరువాత 55వ స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్నాడు.

mahesh-babu-Forbes-Celebs-List-1