సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ ప్రస్థానం…

 సూపర్ స్టార్ మహేష్ బాబు 46 వ జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా ఒకసారి ఈ రాజకుమారుడి సినీ ప్రస్థానాన్ని తెలుసుకుందాం.

1975 ఆగస్ట్ 9న చెన్నైలో సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ, ఇందిర దంపతులకు జన్మించారు. తన నాలుగవ ఏటనే దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో నీడ చిత్రంతో వెండితెర ముందుకు వచ్చారు.

ఆ తర్వాత బాలనటుడిగా తండ్రి దర్శకత్వంలో అనేక చిత్రాల్లో నటించారు. అలా చిన్నప్పటినుండి తనలోని నటనతో ప్రేక్షకులను అలరించారు. తండ్రి కృష్ణ దర్శకత్వంలో ఐదు చిత్రాల్లో బాలనటుడిగా నటించారు.

రాజకుమారుడు : భారీ చిత్రాలు నిర్మించే వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజకుమారుడు చిత్రంతో పూర్తిస్థాయి నటుడిగా వెండి పరిచయమయ్యారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి ప్రీతిజింత మహేష్‌బాబు సరసన నటించారు.

యువరాజు : వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో యువరాజు చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో మహేష్ సరసన సాక్షి శివానంద్, సిమ్రాన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

వంశీ : అప్పటికే సమరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ పంజా మూవీ ని దర్శకత్వం వహించిన బి.గోపాల్ దర్శకత్వంలో వంశీ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన తన రియల్ లైఫ్ హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ నటించారు.

Namrata with Mahesh Babu from Vamsi

మురారి: మహేష్ లోని మహేష్ బాబు లోని నటుణ్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం మురారి. కృష్ణవంశీ దర్శకత్వంలో సోనాలి బింద్రే హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రంలో మహేష్ బాబు నటనకు అనేక ప్రశంసలు పొందారు. మణిశర్మ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ అందరికీ ఆల్‌టైమ్ ఫేవరెట్.

టక్కరి దొంగ : రొటీన్ చిత్రాలకు భిన్నంగా తన తండ్రి బాటలోనే కౌబాయ్ గా చేసిన చిత్రం టక్కరి దొంగ. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో లీసారే బిపాసాబసు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం టేకింగ్ విధానంలో రిచ్ గా ఉన్నప్పటికీ కథనంలో స్లోగా ఉండటంతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

బాబి : ఎన్నో చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శోభను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ కి రాధా మోహన్ నిర్మించిన చిత్రం బాబి ఈచిత్రంలో మహేష్ బాబు సరసన ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

ఒక్కడు : మహేష్ బాబుకి మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం. మహేష్ బాబు ని సూపర్ స్టార్ గా నిలబెట్టిన చిత్రం ఒక్కడు. తెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా వంద రోజుల పాటు నటించిన చిత్రం ఒక్కడు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో భూమిక జంటగా వచ్చిన భారీ చిత్రం ఒక్కడు.

నిజం : ఒక్కడు వంటి భారీ విజయం తర్వాత తేజ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన చిత్రం నిజం. రక్షిత జంటగా నటించిన ఈ చిత్రంలో అవినీతిపై పోరాడే ఒక సామాన్యుడి పాత్ర పోషించారు. ఈ చిత్రంలోని మహేష్ బాబు నటన గాను రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుతో సత్కరించింది. ఈచిత్రంలో మరో హీరో గోపీచంద్ విలన్ గా హీరోయిన్ రాశి నటించారు.

నాని : పవన్ కళ్యాణ్ ఖుషి వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ఎస్.జె.సూర్య దర్శకత్వంలో మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని నిర్మాణంలో వచ్చిన చిత్రం నాని ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకొని ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో బాలీవుడ్ నటి అమీషా పటేల్ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

అర్జున్ : మహేష్‌బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ నిర్మాణ సారథ్యంలో ఒక్కడు వంటి సూపర్ హిట్ చిత్ర దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో శ్రీయ చరణ్ జంటగా నటించిన చిత్రం అర్జున్. భారీ సెట్టింగులతో నిర్మితమైన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర అంతగా ఆకట్టుకోకపోయినా మహేష్ బాబు కెరీర్ లో ఒక mylestone గా నిలిచింది. కీర్తి రెడ్డి కి మహేష్ బాబుకు చెల్లి గా నటించింది.

అతడు : జయభేరి ప్రొడక్షన్ బ్యానర్ పై త్రివిక్రమ్ దర్శకత్వంలో మురళీమోహన్ నిర్మించిన చిత్రం అతడు. అప్పటి వరకు మాస్ చిత్రాలు చేస్తున్నా మహేష్ లోని సాఫ్ట్ హీరోని వెలికి తీసిన చిత్రం. ఈ చిత్రం ఇప్పటికీ టీవీలో వస్తే చూస్తూనే ఉన్నారు ఈ చిత్రంలో మహేష్ బాబుకు జంటగా త్రిష నటించారు.

పోకిరి : మాస్ చిత్రాల దర్శకుడు పూరీ జగన్నాథ్జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు సోదరి మంజుల నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులన్నీ బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దర్శకుడు పూరి జగన్నాథ్ రాసిన సంభాషణలు మహేష్ బాబు పలికిన విధానం కలిపి ఈ చిత్రాన్ని భారీ హిట్ గా నిలిచాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు కు జంటగా ఇలియానా డి క్రూజ్ నటించింది.

సైనికుడు : మహేష్ బాబు తో ఒక్కడు వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు మొదటి చిత్రం నిర్మాత అశ్వినీదత్ నిర్మాణంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై వచ్చిన చిత్రం సైనికుడు. హీరోయిన్ త్రిష నటించిన ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు.

అతిథి : బాలీవుడ్ లో పెద్ద నిర్మాణ సంస్థ అయినటువంటి యూటీవీ మోషన్ పిక్చర్స్ వారు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం అతిథి. అమృతా రావు యాక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

ఖలేజా : అతడు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన త్రివిక్రమ్, అప్పటికే లేడీ సూపర్ స్టార్ పొజిషన్లో ఉన్న అనుష్క శెట్టి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రం ఖలేజా. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. బిగ్ స్క్రీన్ పై అంతగా ఆకట్టుకొని ఈ చిత్రం బుల్లి తెరపై మాత్రం అనేక రికార్డులను నెలకొల్పింది.

దూకుడు : పోకిరి వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో సమంత జోడిగా మహేష్ బాబు నటించిన చిత్రం దూకుడు. తెలుగు ఇండస్ట్రీ కాగానే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా తన స్టామినా ని చూపించి, తెలుగు చిత్ర పరిశ్రమకు ఓవర్సీస్ మార్కెట్‌ని తీసుకొచ్చిన చిత్రం.

బిజినెస్ మాన్ : పోకిరి వంటి సూపర్ హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కాజల్ జోడిగా మహేష్ నటించిన చిత్రం బిజినెస్ మాన్ ఈ సినిమాలోని డైలాగులు ఇప్పటికీ పలుకుతూనే ఉంటాయి.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు : దూకుడు బిజినెస్ మాన్ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ హిట్స్ తో దూసుకుపోతున్న మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో సీనియర్ హీరోయిన్ ఆ వెంకటేష్ దగ్గుబాటి తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన ఈ చిత్రంలో మహేష్ కు జోడీగా సమంత, వెంకటేష్ కు జోడీగా అంజలి నటించారు.

1 నేనొక్కడినే : క్లాస్ మూవీ కి పెట్టింది పేరైన సుకుమార్ దర్శకత్వంలో దూకుడు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ నిర్మాణంలో వచ్చిన చిత్రం 1 నేనొక్కడినే. ఈ చిత్రంలో మహేష్ బాబు జోడిగా కృతి సనన్ నటించారు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.

ఆగడు : దూకుడు చిత్రం తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ బ్యానర్ పై వచ్చిన చిత్రం ఆగడు. మహేష్ కు జోడిగా తమన్నా నటించిన ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు

శ్రీమంతుడు : మరొక్కసారి మహేష్ బాబు స్టామినాని చూపించిన చిత్రం శ్రీమంతుడు. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో మహేష్ కు జోడీగా శృతిహాసన్ నటించారు. ఈ చిత్రం దాదాపు అప్పటివరకు ఉన్నా అన్ని ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి మహేష్ బాబు ని సూపర్ స్టార్ గా నిలబెట్టింది.

బ్రహ్మోత్సవం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రం బ్రహ్మోత్సవం. కాజల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది.

స్పైడర్ : తమిళ్ లో ఎన్నో హిట్ చిత్రాలు అందించిన ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో హిట్ చిత్రాల దర్శకుడు ఎస్బిఐ సూర్య విలన్ గా రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన చిత్రం స్పైడర్. హరీస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించారు.

భరత్ అనే నేను : శ్రీమంతుడు వంటి భారీ హిట్ చిత్రాన్ని ఇచ్చిన దర్శకులు కొరటాల శివ దర్శకత్వంలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ కలిసి నటించిన చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది.

మహర్షి : వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం మహర్షి. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

సరిలేరు నీకెవ్వరు : కామెడీ చిత్రాలతో హిట్ కొట్టే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రష్మిక,
మహేష్ బాబు కలిసి నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రంలో మహేష్ బాబుతో పాటు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కలిసి నటించారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది.

2 comments

Comments are closed.
Website