వరుణ్‌తేజ్‌కి జంటగా లావణ్య త్రిపాఠి
వరుణ్‌తేజ శ్రీనువైట్ల దర్శకత్వంలోవస్తున్న ఓ రొమాంటిక్, ఎంటర్‌టైనర్ చిత్రంలో వరుణ్‌తేజ సరసన ప్రస్తుత నవ కథానాయకల్లో భారీగా ఆఫర్లు అందుకుంటున్న లావణ్య త్రిపాఠి నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై లావణ్య త్రిపాఠి కానీ, శ్రీనువైట్ల కానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ప్రస్తుతం లావణ్య.. సందీప్‌కిషన్‌కి జంటగా ఓ చిత్రంలో అవకాశం దక్కించుకుంది.