KGF 2 విడుదల అప్పుడేనా?

యశ్‌, ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ‘కేజీయఫ్‌’ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కె.జి.యఫ్‌: ఛాప్టర్‌ 2’. జులై 16న తెరపైకి రావాల్సిన ఈ చిత్రం ప్రస్తుతం కరోనా కేసులు పెరగడం కారణంగా వాయిదా పడినట్లే. అయితే, దసరా పండగ నాటికి విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ సన్నద్ధమైందని సమాచారం. ఇప్పటికే సినిమా కన్నడ వెర్షన్‌ డబ్బింగ్‌ పూర్తయింది. ఆ మధ్య దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ డబ్బింగ్‌ స్టూడియోలో హీరో యశ్‌తో కలిసి దిగిన ఫొటోను తన ట్విటర్‌లో షేర్ చేశారు. పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రవి బ్రసూర్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. సంజయ్‌దత్‌ అధీరా పాత్రలో నటిస్తుండగా రవీనా టాండన్ ప్రధాని రమికా సేన్ పాత్రలో కనిపించనుంది. ప్రకాశ్‌రాజ్‌, అనంత్‌ నాగ్‌, రావు రమేశ్‌, ఈశ్వరీరావు, టీఎస్‌ నాగాభరణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.