జాతి—సంస్కృతి

ప్రపంచదేశాలలో భారతీయ సంస్కృతికి విశిష్టమైన స్థానం ఉంది. భారతీయ సంస్కృతి అత్యంత పురాతనమైనది, సనాతనమైనది, నేటికీ ఆచరించదగినది.

సంస్కృతి ఒక జాతి విశిష్టతను, ఉన్నతిని చక్కగా తెలియజేస్తుంది. సాంప్రదాయము, ఆధ్యాత్మికత, భౌతిక విషయాల సమాహారం సంస్కృతి. తరాలు మారుతుంటాయి. మారిన తరాలనుండి ఆ తర్వాత తరాలకు అందించే వారసత్వ సంపద సంస్కృతి. భారతీయులు స్వతహాగా శాంతి కాముకులు. ఈ భూమి ప్రజలు వేద కాలం నుండి ఒక దేశాన్ని ఆక్రమించుకోవడం గాని అకారణంగా దండయాత్రకు కానీ ప్రయత్నించలేదు. అదేవిధంగా భారతదేశంపై దండయాత్రకు వచ్చిన శత్రు రాజులను సరిహద్దుల్లోనే నిలువరించి పలాయనం చిత్తగింపచెసిన సాహసవంతులు భారతీయులు. వేల సంవత్సరాల కాలగమనంలో అనేక దాడులను ఎదుర్కొని నిలబడిన దేశం భారతదేశం. అనేక ధర్మాలను, మతాలను, రాజులను ఆదరించిన దేశం భారతదేశం. సకలశాస్త్ర విజ్ఞానానికి, ఉన్నతమైన సంస్కృతి సాంప్రదాయాలకు, అనురాగానికి, ఆప్యాయతకి, అభిమానానికి, పౌరుష పరాక్రమాలకి, అతిఉన్నతమైన మానవ సంబంధాలకు పుట్టినిల్లయిన భారతదేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి.

ప్రపంచంలోని అనేక నాగరికతలలో రోమన్, బాబిలోనియన్, ఈజిప్ట్, గ్రీస్, మెసొపొటేమియా, మొదలగు నాగరికతలు అంతరించిన నాగరికతలు. అత్యంత పురాతనమైనది, సనాతనమైనది, సజీవంగా ఉన్నది సింధు(హిందూ) నాగరికత. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరం మొదటగా వెలికి తీయుటచే ఇది సింధు లోయ హరప్పా నాగరికత అని పిలువబడుతున్నది. సింధులోయ నాగరికతకు దక్షిణ భారత దేశంతో ఉన్న సంబంధాలు తెలిపే అవశేషాలు కేరళలోని వాయనాడ్ జిల్లా ఎడక్కల్ గుహల్లో హరప్పా నాగరికతకు సంబంధించిన రాతి నగిషీలు లభించాయి. కర్ణాటకలోనూ, తమిళనాడులోనూ సింధులోయ నాగరికతకు సంబంధించిన అవశేషాలు ఎప్పుడో దొరికాయి. అయితే కేరళలో లభించిన అవశేషాలతో హరప్పా నాగరికత దక్షిణ భారత దేశంలోనూ విలసిల్లిందని చెప్పే ఆధారాలు మరింత బలపడ్డాయని చరిత్రకారుడు ఎం. ఆర్. రాఘవ వారియర్ చెప్పారు.

ప్రపంచంలోని పురాతనమైన క్రిస్టియన్ చర్చి కేరళలోని మలబార్ పట్టణంలో ఉంది. ఇస్లాం లో ఉన్న 72 ఫిర్కాలు కలిగిన ఏకైక దేశం భారతదేశం. ఇజ్రాయిల్ లోని యూదులు బహిష్కరణకు, ఊచ కోతకు గురైనప్పుడు వారు తలదాచుకున్నది, ఆశ్రయం పొందినది ఈ భరత భూమిలో. నేటికీ వారు మన పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటారు. శ్రీరామచంద్రమూర్తి లంకను గెలిచి తదుపరి పాలించమని రాజ్యం విభీషణునికి అప్పజెప్పను. కంబోడియాలో నేటి (కంపూచియా) కంబ మహర్షి వెళ్లి జ్ఞాన బోధ సంస్కారాలు నేర్పి తిరిగి వచ్చాడు కానీ తన వారసత్వాన్ని కొనసాగించలేదు. ఇండోనేషియా ప్రజలు నేటికీ హిందూ ధర్మాన్ని హిందూ దేవతలను పూజిస్తారు కానీ వారు మహమ్మదీయులు. వారి నగదు పైన హిందూ దేవతల మరియు సాంప్రదాయ చిత్రాలు ఉంటాయి. వారి మతం ఇస్లాం అయినప్పటికీ వారు పాటించే పద్ధతి హిందూ జీవన విధానం. ఈ ప్రకారంగా అఖండ భారత దేశంలోని భూభాగాల అన్నిటిలో హిందూ జీవన విధానం వేళ్లూనుకుని ఉన్నది.

ప్రాణికోటి మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తరువాతే జీవకోటి ఉద్భవించింది. జలాధారాల వెంటనే తొలుత నాగరీకత విస్తరించింది. అలాంటి జలాన్ని దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సాంప్రదాయం. దేవ గురువు బృహస్పతి పరిభ్రమణం వలన వివిధ రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుష్కరాలు వస్తుంటాయి. యుగాల నుండి మనకి ఈ సంగతి తెలిసినదే. సూర్య, చంద్ర గ్రహణ స్థితిగతులను మన పంచాంగ జాతక పుస్తకాలలో వేల సంవత్సరాల క్రితమే పొందుపరిచారు. గత వంద సంవత్సరాల క్రితం నుండి ఈ విషయం విదేశీయులకు తెలుసు.

1633వ సంవత్సరంలో గెలీలియో భూమి గుండ్రంగా ఉందని చెప్పినందుకు ఉరిశిక్షకి గురి చేయబడ్డాడు. వేల సంవత్సరాల క్రితం కూర్మావతారంలో ఒక కూర్మం భూమిని మోస్తూ ఉంటుంది. అది గుండ్రంగా ఉంటుంది. దీనిని జగతి అంటారు. దేనికి గతి ఉన్నదో అదే జగతి, భూగోళం. 1900వ సంవత్సరంలో మ్యాక్స్ ప్లాన్ కాంతి సిద్ధాంతం వెలువరించారు. 1916 వ సంవత్సరంలో మాత్రమే గ్రహణాల విషయం బయటపడింది. 1920వ సంవత్సరంలో ఎడ్విన్ ఆర్నాల్డ్ విశ్వ విస్తృతి గురించి ప్రస్తావించారు. జేజే థామ్సన్ అణు సిద్ధాంతాన్ని పొందుపరిచాడు. మన ఋషులు, మునులు పురాతన కాలంలో కాపర్, మాంగనీస్ వంటి లోహాలను ఉత్పత్తి చేసిన రోజులలో విదేశీయులు అంధకారంలో అలమటించారు. అప్పటికే మన విజ్ఞానం వారికి అందనంత ఎత్తులో ఉంది.

తులసీదాస్ హనుమాన్ చాలీసా లో భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరాన్ని ఈ విధంగా చెప్పారు.

యుగ సహస్ర యోజన పర భాను|
లీల్యో తాహి మధుర ఫల జాను||

  • 1Yug = 12000 years
  • 1Sahastra = 1000
  • 1Yojan = 8 Miles
  • Yug x Sahastra x Yojan = par Bhanu
  • 12000 x 1000 x 8 miles = 96,000,000 miles
  • 1 mile = 1.6 kms
  • 96,000,000 miles=96000000 x 1.6kms=153,600,000 kms to Sun
  • NASA has said that, it is the exact distance between Earth and Sun

ఈ తూకము నాసా తూకముతో సరితూగుతుంది.

సూచన :
జి.ఆర్. కె. మూర్తి.