మేకప్ లేకుండా బికినీ సెల్ఫీతో ఇలియానా రచ్చ

తెలుగులో వరుస ఫ్లాపులు ఎదురవడంతో బాలీవుడ్‌కి ఇలియానా, అక్కడ ఫస్ట్ మూవీతోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత హిందీలో అవకాశాల మీద అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే కొంత గ్యాప్ తర్వాత కిక్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన ‘రవితేజ’ తో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ద్వారా తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా దారుణ పరాజయం పాలవడంతో తెలుగులో ఆఫర్లు కరువయ్యాయి.

సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా ద్వారా ఇలియానా తన అభిమానులతో మాత్రం నిరంతరం టచ్‌లోనే ఉంటోంది. తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఫలితంగా తన అందాలతో ఇంటర్నెట్‌ను విపరీతంగా షేక్ చేస్తోంది. దీంతో ఆమె ఫాలోవర్లు కూడా పెరుగుతున్నారు.


సోషల్ మీడియాలో బిజీగా ఉండే గోవా భామ ఇలియానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో గోవా బీచ్‌లో బికినీ ధరించి ఎద అందాలతో కనువిందు చేస్తూ దిగిన హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె మేకప్ లేకుండా కనిపించింది. ఫలితంగా చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అవుతోంది.