టాలీవుడ్లో ప్రస్తుతం పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా సైలెంట్‌గా థియేటర్లలో విడుదలై, కేవలం మౌత్ టాక్ తోనే అద్భుతమైన విజయాలను అందుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో చిన్న సినిమాలే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ కోవకే చెందిన మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘హుషార్ పిట్టలు’ సినిమా థియేటర్లలో భారీ స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా కాలేజ్ కుర్రాళ్లను, యువతను ఈ చిత్రం అమితంగా ఆకట్టుకుంది.
యూత్ ఫుల్ అడల్ట్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం అడల్ట్ కామెడీ జోనర్‌కే పరిమితం కాకుండా, యువత జీవితాల్లోని భావోద్వేగాలు, ప్రేమ, స్నేహం మరియు ఎట్రాక్షన్ వంటి అంశాలను చాలా చక్కగా తెరపై ఆవిష్కరించారు. దీనివల్ల ఈ సినిమా కేవలం యూత్‌ను మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా బాగా మెప్పించింది. థియేటర్లలో ఈ సినిమా సృష్టించిన సందోహం అంతా ఇంతా కాదు.
ఇప్పుడు థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకుల కోసం మేకర్స్ గుడ్ నూస్ చెప్పారు. బాక్సాఫీస్ వద్ద అలరించిన ‘హుషార్ పిట్టలు’ చిత్రం తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంట్లోనే ఉండి కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి ఈ వినోదాత్మక చిత్రాన్ని వీక్షించేందుకు ఇది మంచి అవకాశం.
ఈ రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్లో అన్షు మరియు వాసవి గణేషన్ జంటగా నటించారు. బిక్షు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, యూత్ మనసులను హత్తుకునేలా కథను నడిపించారు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ బ్యానర్‌పై వెంకట్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో ఈ మూవీ చూడలేకపోయిన ప్రేక్షకులు వెంటనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు.
