కరసేవకులకు సత్కారం….

అయోధ్యలో రామమందిరం భూమి పూజ సందర్భంగా ఈరోజు యావత్ భారతదేశం పండుగ చేసుకుంటున్న తరుణంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో హిందూ సమాజం నాటి కరసేవలో పాల్గొన్న కార్యకర్తలను స్మరించుకొని సత్కరిస్తుంది. అదేస్పూర్తితో గ్రామ గ్రామాన రామాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా భాగ్యనగరంలోని నిజాంపేట లో ఉన్న అభయాంజనేయ స్వామి గుడి వద్ద కొందరు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు, రామ భక్తులు, హిందూ సమాజం కరసేవలో పాల్గొన్న ఇద్దరు కార్యకర్తలను సత్కరించడం జరిగింది. వారు శ్రీ అల్లంపాటి శివ శంకర్ రెడ్డి గారు, శ్రీ గంజాయి కిషన్ గారు.

ఒక మనిషికి గుణగణాలు ఎంత ముఖ్యమైనవో తెలియజెప్పే విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైన శ్రీరాముని అవతారం గురించి తెలియని వారుండరు. రామాయణాన్ని ఒక మహా కావ్యంగా, సీతారాములను ఆదర్శప్రాయంగా ప్రజలు భావిస్తారు. అందుకే రాముడు జన్మించిన అయోధ్య నగరానికి, హిందూ ప్రజలకు మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. కేవలం హిందువులకే కాదు.. ముస్లిం, బౌద్ధ, జైన మతాల ప్రజలు కూడా ఈ ప్రదేశాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.

శ్రీ గంజాయి కిషన్ గారు:

శ్రీ గంజాయి కిషన్ గారు, భాగ్యనగరంలోని మల్కాజ్గిరి ప్రాంతంలో నివాసముండేవారు ప్రస్తుత నివాసం నిజాంపేట. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త. రావణాసురుడు పైకి దండెత్తిన రాముని వానరసైన్యంలా వివాదాస్పద కట్టడమైన బాబ్రీ మసీదును కూల్చడానికి కరసేవకులు తండోపతండాలుగా వచ్చారని, కరసేవలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం అని, మర్చిపోలేని తీపి గుర్తు అని తెలియజేశారు.

శ్రీ అల్లంపాటి శివ శంకర్ రెడ్డి గారు:

శ్రీ అల్లంపాటి శివ శంకర్ రెడ్డి గారు ప్రస్తుత నివాసం భాగ్యనగరంలోని నిజాంపేట, వారు సంఘ కుటుంబం. నెల్లూరు లో ఉండగా 16 సంవత్సరాల వయసులో ఇంట్లో చెప్పకుండా పదిమంది స్వయం సేవకులు తో కలిసి అయోధ్యకు పయనమయ్యారు. దాదాపు పదిహేను రోజులు అక్కడే ఉన్నారు. లక్షల్లో వచ్చిన మాలాంటి కరసేవకులకు దారివెంట ప్రజలు బ్రహ్మరథం పట్టి అన్నపానాదులు సమకూర్చారని తెలిపారు. ఏ జన్మ పుణ్యమో ఈ జన్మలో రామకార్యం లో పాల్గొన్నందుకు సంతోషిస్తున్నాం అని తెలియజేశారు.

1 comments

మంచి కార్యక్రమం చేశారు.ధన్యవాదాలు

Comments are closed.
Website