రామజన్మభూమి చారిత్రక సాక్ష్యాలు….
కోసలరాజ్యానికి రాజధాని, దశరథుడి రాజ్యసభ, రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం, సరయు నది తీరంలో ఉన్న పట్టణం, శ్రీమహావిష్ణువు అవతారాల్లో ఒకటైన శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో భవ్యమైన రామమందిరాన్ని నిర్మించుకోవడం కోసం హిందువులు 500ఏళ్ళపాటు పోరాటం చేయవలసి వచ్చింది. ఎన్నో ఉద్యమాలు, సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆగస్ట్ 5న మందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతుంది. ఈ సందర్భంగా రామజన్మభూమి పోరాట చరిత్రను పరిశీలిద్దాం.
పురావస్తు పరిశోధన:
పురావస్తు పరిశోధన శాఖ జరిపిన విస్తృతమైన తవ్వకాల తరువాత రామ జన్మభూమిలో నిస్సందేహంగా ఒక గొప్ప ఆలయము ఉండేదని నిర్ధారించింది. అలాగే దానిని కూల్చి ఆ స్థానంలోనే బాబరీ కట్టడం కట్టారని కూడా తేల్చింది.
సాహిత్య సాక్ష్యాలు:
వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరితమానస్ వంటి అనేక పురాణ గ్రంధాల్లో అయోధ్య గొప్పదనం విపులీకరించబడింది.
కావ్యాలు:
వాల్మీకి రామాయణము, మహాభారతంలో రామ ఉపాఖ్యానము (వన పర్వము), యోగ వాశిష్ట్యం, ఆధ్యాత్మ రామాయణము, రఘువంశము మొ॥
కవితలు:
రమాగీత-గోవిందము, గీత రాఘవ, రామ విలాసము, రామ అష్టకము మొ॥
నాటకాలు:
ప్రతిమాభిషేకము, ఉత్తర రామచరిత్ర, హనుమానాటకము, ప్రసన్న రాఘవ, రామాభ్యుదయము మొ॥
ఆఖ్యాన:
బృహత్ కథామంజరి, చంపు రామాయణము, కథ సరిత్సరం మొ॥
పురాణాలు:
విష్ణు, బ్రహ్మాండ, వాయు, కూర్మ, పద్మ, స్కంద, నారద మొ॥
ఉపనిషత్తులు:
రామోత్తర తపనీయ, రామ రహస్యము మొ॥
మరికొన్ని గ్రంధాలు:
జైమినియా, అశ్వమేధము, హనుమత్ విజయము, హనుమత్ సంహితము, బృహత్ కౌశల్ ఖండ్ మొ॥
ముస్లిం రచయితల పుస్తకాలు:
1). సాహిఫా-ఈ-చాహల్-నాసా-ఇహ్-బహద్దూర్ షాహీ
2). హదిక-ఈ-షాదా
3). తారీఖ్-ఈ-అవధ్ మొ॥ మరెన్నో విదేశీ చరిత్రకారుల రచనలు ఆధారాలు గా నిలిచాయి.
రామ జన్మభూమి ఉద్యమం దేశ సంస్కృతి సంప్రదాయాలకు తిరిగి గౌరవం సాధించడం. హిందూ అస్తిత్వానికి సంబంధించిన అంశం. ఇలాంటి చారిత్రక ప్రదేశాలు నుండి పురాతన ఆలయాల వలన ప్రజలు వారి గత వైభవాలను గుర్తుచేసుకుని ప్రేరణ పొందుతారు.