ఆంధ్ర ప్రదేశ్: కొత్త జిల్లాల ఏర్పాటులో హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతూ తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ ఏపీ సీఎం జగన్, సీఎస్ నీలం సాహ్నీలకు టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ విడివిడిగా లేఖలు రాశారు. హిందూపురం జిల్లా కేంద్రమైతే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత జిల్లా కేంద్రమైన అనంతపురం హిందూపురానికి 110 కిలో మీటర్ల దూరంలో ఉందని గుర్తు చేస్తూ నియోజకవర్గంలోని మాల్గురులో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. మాల్గురులో అందుకు సరిపడా భూమి అందుబాటులో ఉందని లేఖలో ప్రస్తావించారు.