మనం కొబ్బరి నూనెను తలకు మాత్రమే రాసుకుంటాం. కానీ, కేరళ ప్రజలు వంటల్లో కూడా కొబ్బరినూనెనే వాడతారు. కేరళ తరహాలోనే మనకు కూడా బోలెడన్ని కొబ్బరి తోటలు ఉన్నాయి. కోనసీమలో అడుగు పెడితే అడుగుకో కొబ్బరి చెట్టు ఉంటుంది. అయినా సరే.. మనం కొబ్బరి నూనెను ఇంకా తలకు వాడే తైలంగానే భావిస్తున్నాం. కొబ్బరిలో ప్రతి ఒక్కటికీ ఉత్తమమే. కొబ్బరి నీళ్ల నుంచి.. నూనె వరకు ప్రతి ఒక్కటీ ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఈ కరోనా సీజన్లో కేరళ ప్రజలు త్వరగా వైరస్ నుంచి కోలుకోడానికి ఈ కొబ్బరి నూనె ఎంతగానో ఉపయోగపడుతోందని తాజా పరిశోధనలో తేలింది. ఈ నేపథ్యంలో కొబ్బరి నూనెను మనం ఆహారంలో ఎందుకు తీసుకోవాలో తెలుసుకుందాం. అలాగే.. అందాన్ని పెంపొందించడంలో కొబ్బరి ఎలాంటి పాత్రను పోషిస్తుందనేది కూడా చూద్దాం.
ప్రయోజనాలు:
- కొబ్బరి నూనెలో విటమిన్ E, Kతోపాటు ఐరన్ తదితర మినరల్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి.
- కొబ్బరి నూనె వల్ల శరీరంలో గుండెకు మేలు చేసే మంచి కొవ్వు (HDL) పెరుగుతుందని తాజా అధ్యయనంలో తెలిసింది.
- రక్తపోటు, మధుమేహం రోగులకు కూడా కొబ్బరి నూనె చాలా మేలు చేస్తుంది.
- కొబ్బరి నూనెలోని లోరిక్ యాసిడ్.. మోనో లోరిన్‌గా పరివర్తన చెంది బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడుతుంది.
- అజీర్ణం కలిగించే వివిధ బ్యాక్టీరియాలు, ఫంగస్‌లతో కొబ్బరి నూనె పోరాడుతుంది.
- కొబ్బరి నూనె రోగ నిరోధక శక్తిని పెంపొందించి జ్వరాలు, వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది.
- కొబ్బరి నూనె జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
- పేగుల సమస్య నుంచి రక్షిస్తుంది.
- నూనెలను అతిగా వాడితే గుండె జబ్బులు వస్తాయి. కానీ, కొబ్బరి నూనె వల్ల అలాంటి సమస్యలు ఉండవు.
- కొబ్బరి నూనెను ఎన్నో శతాబ్దాల నుంచి సౌందర్య అవసరాలకు వాడుతున్నారు.
- కొబ్బరి నూనెలో రక్తపోటును నియంత్రించే లోరిక్ యాసిడ్ 50 శాతం ఉంటుంది.
- కొబ్బరి నూనెను మంచి మాయిశ్చరైజర్ కూడ. దీన్ని ఎలాంటి చర్మం వారైనా వాడొచ్చు.
- జట్టు బాగా పెరిగేందుకు అవసరమైన పోషకాలన్నీ కొబ్బరి నూనెలో ఉంటాయి.
- ముడతలు, చర్మం పగుళ్లను కొబ్బరి నూనె నియంత్రిస్తుంది.
- సహజ పద్ధతుల్లో బరువు తగ్గాలనుకొనేవారు తప్పకుండా కొబ్బరి నూనె వాడండి.
- కొబ్బరి నూనె రసాయనాలు లేని సహజ హెయిర్ కండిషనర్‌గా పనిచేస్తుంది.
- కొబ్బరి నూనె జీవక్రియను పెంపొందించడంతో పాటు థైరాయిడ్, ఎండోక్రైన్ గ్రంధులు సక్రమంగా పనిచేయడానికి సహకరిస్తుంది.
గమనిక: పలు పరిశోధనలు, నిపుణుల అభిప్రాయాల మేరకు ఈ సూచనలు అందించామని గమనించగలరు.