ద్రాక్ష అతి ప్రాచీనకాలం నుంచి సాగవుతున్న పండు. ఇందులో దాదాపుగా అరవైకి పైగా రకాలున్నాయి. పండ్లుగానే తినడంతో పాటు పానీయంగా, సలాడ్లుగా కూడా ద్రాక్షను వాడుతూ ఉంటారు. ఆసియా దేశాల్లోనే పుట్టిన ఈ పండ్లు ప్రపంచంలోని అన్ని శీతల ప్రదేశాల్లో పెరుగుతాయి. ద్రాక్షను పండించడం మొదలైన కొత్తలో కేవలం వైన్ తయారీకి మాత్రమే వాడేవారు. ఆ తర్వాతే తినడానికి కూడా వాడుతూ వస్తున్నారు. ఇప్పుడైతే ఎండు ద్రాక్ష కూడా బాగా కనిపిస్తూ ఉంది.
పోషకాలు: ద్రాక్షలో పోషక విలువలు చాలానే ఉన్నాయి. పిండి పదార్థాలు, చక్కెర పదార్థాలతో పాటు విటమిన్–ఎ, విటమిన్–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్– సి, విటమిన్–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ లాంటి ఖనిజ లవణాలు మెండుగా ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: ద్రాక్ష వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మూత్రపిండ సమస్యలతో బాధపడే వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడం, క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో కూడా ద్రాక్ష ఉపయోగపడుతుంది. మలబద్ధకం, ఆస్తమా, గుండె జబ్బులు, అజీర్ణం, మైగ్రేయిన్.. ఇలా చాలా రోగాలకు ద్రాక్ష అద్భుతంగా పనిచేస్తుంది