నందమూరి బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో శాతకర్ణి తల్లి గౌతమి బాలాశ్రీగా డ్రీమ్‌గాళ్‌గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ అందాల తార హేమమాలిని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. మాతృమూర్తిగా నటిస్తున్న హేమమాలిని ఆదివారం పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ని విడుదలచేచారు. గౌతమీపుత్ర శాతకర్ణిగా నందమూరి బాలకృష్ణ, వాశిష్టీ దేవిగా శ్రియా శరణ్ ఫస్ట్‌లుక్‌లు ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్నాయి. దసరా సందర్భంగా విడుదల చేసిన మా చిత్ర టీజర్‌కు గొప్ప స్పందన వస్తోంది. రెండు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, కళా దర్శకత్వం: భూపేష్ భూపతి, కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: చిరంతన భట్, పాటలు: సిరివెన్నెల సీతారామశాసి్త్ర, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు.
http://freshga.com/nbk100-gautamiputra-satakarni-official-teaser/