ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో పక్క రాష్ట్రాలకు వెళ్లి వచ్చేటప్పుడు కొంతమంది చాటుగా మద్యం బాటిల్స్ తెచ్చుకుంటారు. ఇప్పటి వరకు ఒక్క మద్యం బాటిల్ తో ప్రయాణం చేసినా పోలీసులు పట్టుకుంటున్నారు.
తాజాగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. జీవో నెంబర్ 411 ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చని తెలిపింది. ఈ జీవోను అమలు చేయాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది మందుబాబులకు శుభవార్త అనే చెప్పాలి.