తణుకులో చేపల వాన

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆదివారం చేపల వాన కురిసింది.  తణుకులోని జాతీయ రహదారి వెంబడి వర్షంతో పాటు చేపలు కూడా పడ్డాయి. దీంతో వాటిని పట్టుకునేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు. వర్షంతో పాటు చేపలు కూడా పడటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి తామెప్పుడూ చూడలేదని స్థానికులు పేర్కొన్నారు.