37 ఏళ్ళ బాలకృష్ణ తొలి బ్లాక్ బస్టర్ ‘మంగమ్మ గారి మనవడు’.

శ్లాబ్‌ సిస్టమ్‌లో తొలి సిల్వర్‌ జూబ్లీ, బాలకృష్ణ తొలి బ్లాక్ బస్టర్ ‘మంగమ్మ గారి మనవడు’. భానుమతి విశ్వరూపం, 565 రోజులు ప్రదర్శితమై తెలుగులో అత్యధిక రోజులు ఆడిన సినిమాగా ఆల్‌టైమ్‌ రికార్డ్‌

37 ఏళ్ళ క్రితం విడుదలైన నందమూరి బాలకృష్ణ తొలి బ్లాక్ బస్టర్  ‘మంగమ్మ గారి మనవడు’ గురించి బాలయ్య అభిమానులు ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటారు. 1984 సెప్టెంబర్‌ 7న భానుమతి 61వ జన్మదిన కానుకగా విడుదలైన ‘మంగమ్మగారి మనవడు’ తెలుగు సినీ చరిత్రలో సంచలనాలను నెలకొల్పింది.

45కు పైగా ప్రింట్లతో విడుదలై, 28 కేంద్రాల్లో (ఇందులో 6 డైరెక్ట్‌, మిగతావి షిఫ్టింగ్‌ నూన్‌షోలు) వందరోజులు ప్రదర్శితమైంది. హైదరాబాద్‌ నగరంలో ఎక్కువ థియేటర్లలో లాంగ్‌రన్‌ ప్రదర్శించడం ఈ సినిమాతోనే మొదలైంది. ఒక్క హైదరాబాద్‌లోనే ఈ చిత్రం యాభై లక్షలకు పైగా వసూలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్‌లోని తారకరామా థియేటర్‌లో 175 రోజులు ప్రదర్శితమై, శ్లాబ్‌ సిస్టమ్‌లో తొలి సిల్వర్‌ జూబ్లీగా నిలిచిపోయింది. హైదరాబాద్‌ నగరంలో మూడు థియేటర్‌లలో 200 రోజులు ప్రదర్శితమైంది. అలాగే షిఫ్టింగ్స్‌తో 565 రోజులు ప్రదర్శితమై తెలుగులో అత్యధిక రోజులు ఆడిన సినిమాగా ఆల్‌టైమ్‌ రికార్డ్‌ సృష్టించింది.

పంచెకట్టులో బాలకృష్ణ వీరన్న పాత్రలో అచ్చుగుద్దినట్టు సరిపోయారు. ‘చందురుడు నిన్ను చూసి చేతులెత్తాడు…’ పాటలో శ్రీరామునిగా, శ్రీకృష్ణుడిగా కనబడతారు.