తెలంగాణాలో 3 నెలలు ఇంటి అద్దె అడగొద్దు… సీఎం కేసీఆర్ !

తెలంగాణాలో 3 నెలలు ఇంటి అద్దె అడగొద్దు… సీఎం కేసీఆర్ !

తెలంగాణాలో ఇంటి యజమానులకు కేసీఆర్ హెచ్చరించారు.. అద్దెకు ఉండేవారిని మూడు నెలల వరకు ఇంటి అద్దె ఇవ్వమని ఒత్తిడి చేయవద్దని స్పష్టం చేసారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇది మార్చి, ఏప్రిల్, మే నెలకు ఇల్లు అద్దె గురించి వర్తిస్తుందని తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కిరాయిదారుల నుంచి అద్దె వాసులు చేయవద్దని, మూడు నెలలు వాయిదా వేసి ఆ తరువాత కూడా వాయిదా పద్దతిలో తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అందరికి పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి సమయంలో వారిని అద్దెలు చెల్లించమని అడగడం సరికాదని, వారికి కూడా అద్దెలు చెల్లించే పరిస్థితి ఉండదు కాబట్టి ఇంటి యజమానులు అద్దె కోసం వారిని వత్తిడి చేయడడానికి వీలులేదని తెలిపారు. ఇది విజ్ఞప్తి కాదు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారం అని చెప్పారు. ఒకవేళ ఎవరైనా ఇంటి ఓనర్లు అద్దె కట్టమని ఇబ్బంది పెడితే 100 కు డయల్ చేయండి. వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే అద్దె వాసులు చేయడం లేదు కదా అని తరువాత వడ్డీ వసూలు చేయొద్దని స్పష్టం చేసారు సీఎం కేసీఆర్.