డాక్ట‌ర్‌గా ఎమ్మెల్యే శ్రీదేవి

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల వద్ద రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.. బైక్‌ను లారీ ఢీకొనడంతో బైక్‌పై ఉన్న యువ‌కుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.. కరోనా భయంతో ఎవ‌రూ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డానికి ముంద‌డుగు వేయ‌లేదు.. అదే సమయంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి.. గుంటూరు నుంచి పిడుగురాళ్ల మీదగా వెళ్తున్నారు.. ఆ యువ‌కుడి ప‌రిస్థితిని గ‌మ‌నించిన ఆమె.. హుటాహుటిన తన వాహ‌నాన్ని ఆపి.. చేతికి గ్లోవ్స్ ధరించి. బాధితుడికి స‌హాయం చేసింది.. ముందుగా నాడిని ప‌ట్టుకుని పరీక్షించి.. ఆ వెంటనే ప్రథమ చికిత్స అందించారు. అప్పటికే పోలీసులకు సమాచారం ఇవ్వ‌డంతో.. ఇక‌, పెట్రోలింగ్ వాహనం కాసేప‌టి త‌ర్వాత అక్కడికి రావ‌డంతో బాధితుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా స్థానికుల‌తో మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీదేవి.. ప్రమాదంలో ఉన్న వ్యక్తిని ఆదుకోవాలని.. అలా చూస్తూ ఉండటం సరైన విధానం కాదని క్లాస్ తీసుకున్నారు. కరోనా స‌మ‌య‌మే కావ‌చ్చు.. కానీ, తగిన జాగ్రత్తలు తీసుకొని సాయం అందించాలని సూచించారు. తానో ప్ర‌జాప్ర‌తినిధి అయినా.. బాధితుడిని చూడ‌గానే చ‌లించిపోయిన ఎమ్మెల్యే శ్రీ‌దేవిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు నెటిజ‌న్లు.