చిరంజీవి 150 సినిమా లో దీపిక ?

చిరంజీవి 150 సినిమా కథానాయిక ఎవరనే దానిపై ఇప్పటివరకూ స్పష్టత రాలేదు. తొలుత అనుష్క, ఆ తర్వాత నయనతార ఇలా రోజుకో పేరు బయటకు వచ్చింది. కాగా, ఇప్పుడు ఓ బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పదుకొణె పేరు ఇటు ఫిలింనగర్‌తో పాటు అటు బిటౌన్‌లో కూడా హల్‌చల్‌ చేస్తోంది. మెగాస్టార్‌ చిరు 150 చిత్రం ‘కత్తిలాంటోడు’లో దీపిక నటించనుందని ఈ మేరకు చిత్రబృందం ఆమెతో సంప్రదింపులు జరుపుతోందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కత్తిలాంటోడు స్క్రిప్ట్‌ నచ్చడంతో దీపిక సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీపికా అయితే ఈ సినిమాకు మరింత హైప్ వచ్చే ఛాన్స్ ఉంది. పైగా ద‌క్షిణాది చిత్రాల్లో దీపిక న‌టించింది లేదు. దాంతో.. దీపిక కాల్షీట్ల కోసం గ‌ట్టిగా ట్రై చేస్తున్నట్టు చెబుతున్నారు.