బాలీవుడ్‌లో గత రెండు చిత్రాలతో నిరాశ చెందిన రకుల్ ఈ సారి రొమాంటిక్ కామెడీ చిత్రం దే దే ప్యార్ దే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రంలో 50 సంవత్సరాల అంకుల్ అజయ్ దేవగన్‌కు ప్రియురాలిగా నటించడం గమనార్హం. అజయ్ దేవగన్ భార్యగా సీనియర్ హీరోయిన్ టబు నటించింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను అందుకొంటున్నది. నాటుగా.. ఘాటుగా ఉన్న ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..
ఒక్కసారి పడుకొంటే ప్రేమ పుడుతుందా? దే దే ప్యార్ దే ట్రైలర్‌లో మరో సన్నివేశంలో ఒక్కసారి పడుకొంటే ప్రేమ పుడుతుందా అంటూ రకుల్ వయ్యారంగా అడిగే తీరు సినిమాలో రోమాంటిక్ పాళ్లను తెలియజెప్పింది. మొత్తంగా భార్యకు దూరమై.. వయసుపైబడిన యువతి మధ్య రొమాన్స్ చాలా వినోదాత్మకంగా ఉండే అవకాశాలు ట్రైలర్‌లో కనిపించాయి.