పోచమ్మ ఆలయం గర్భగుడిలో ఎలుగుబంటి!

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామ సమీపంలో ఉన్న పోచమ్మ ఆలయం గర్భగుడిలోకి శుక్రవారం రాత్రి ఓ ఎలుగుబంటి కొబ్బరి కుడుకల కోసం చొరబడింది. గుడి వద్ద పడుకున్న ఓ రైతు గమనించి ద్వారానికి గొళ్ల్లెం పెట్టి తాళం వేశాడు. అటవీ అధికారుల సమాచారంతో శనివారం సాయంత్రం రెస్క్యూ బృందం చేరుకుంది. పశువైద్యుడు తుపాకీ ద్వారా మత్తు ఇంజెక్షన్ వేయగా మత్తులోకి జారుకున్న ఎలుగుబంటిని బృందం పట్టుకుంది. అనంతరం దాన్ని బోనులోకి ఎక్కించి అడవిలో వదిలిపెట్టేందుకు వరంగల్ కు తరలించారు.