బాహుబలిని మించిపోయేలా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్

నందమూరి అందగాడు బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్రశాతకర్ణి ట్రైలర్‌ కరీంనగర్‌ పట్టణంలో వేడుకగా బాలయ్య అభిమానుల కోలాహలం మధ్య ఈ ట్రైలర్‌ను తిరుమల థియేటర్‌లో విడుదల చేశారు. ‘మా జైత్రయాత్రను గౌరవించి.. మా ఏలుబడిని అంగీకరించి మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము.. సమయం లేదు మిత్రమా శరణా.. రణమా’ అనే బాలయ్య డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అయిన ట్రైలర్ ఆద్యంతం అలరించిందనే చెప్పాలి.  ‘నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని… పరదేశపు నెత్తుటితో ప్రక్షాళన చేద్దాం.. దొరికిన వాణ్ని తురుముదాం.. దొరకని వాణ్ని తరుముదాం.. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం’  అంటూ బాలయ్య చూపరులను ట్రైలర్‌కు కట్టిపడేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పాలి.

Gautamiputra Satakarni, Gautamiputra Satakarni Movie, Gautamiputra Satakarni Trailer, Balakrishna Gautamiputra Satakarni, Gautamiputra Satakarni Movie Trailer, Balakrishna Gautamiputra Satakarni, Shriya