1000 కోట్లే లక్ష్యంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా బాహుబలి2 ట్రైలర్

1000 కోట్లే లక్ష్యంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా బాహుబలి2 ట్రైలర్

భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటివరకు 1000 కోట్ల మ్యాజిక్ ఫిగర్‌ను ఏ చిత్రం కూడా చేరుకోలేకపోయింది. బాహుబలి2 చిత్రంపై దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా భారీ అంచనాలు నెలకొన్నందున ఈ చిత్రం రూ.1000 నుంచి రూ.1500 కోట్లు వసూలు చేసే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ అంచనాలని నిజం చేస్తూ బాహుబలి- ద కన్‌క్లూజన్ ట్రైలర్ నాలుగు గంటల్లో రెండు మిలియన్ వ్యూస్ దాటిన ట్రైలర్.. మరో మూడు గంటలు గడిచాక అందుకోలేనంత స్థాయికి దూసుకెళ్లిపోయింది.  గంటకు 12 లక్షల చొప్పున వ్యూస్‌ను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకెళ్లిపోతోంది.  తొమ్మిది గంటల్లో బాహుబలి కోటీ వ్యూస్‌ను సాధించింది.

సుమారు 10 వేల థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే కలెక్షన్లు బాహుబలిని వసూళ్ల సునామీ ముంచెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాహుబలి2 రూ.1000 కోట్ల మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకొంటుందనే ఆశాభావం వ్యక్తమవుతున్నది.

SS Rajamouli’s Baahubali 2 Releasing in theaters April 28.

Baahubali 2 – The Conclusion is part a two part Indian movie, directed by S.S. Rajamouli. The film will be released in Telugu, Tamil, Hindi, Malayalam, as well as several other International languages simultaneously. Part 1, Baahubali – The Beginning released on the 10th of July, 2015.

Cast: Prabhas, Anushka, Tamannaah, Rana Daggubati, Sathyaraj, Nasser, Ramya Krishna, Subbaraju