ఈడ మంది లేరా? కత్తుల్లేవా? ‘అరవింద సమేత’ ట్రైలర్

‘మదిరప్పా.. ఇక్కడ మంది లేరా? కత్తులు లేవా?’ అంటూ ఎన్టీఆర్‌ రాయలసీమ పౌరుషంతో తీరు.. ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో.. ఏ అంశంపై ఈ చిత్రం తెరకెక్కిందో చెప్పేస్తుంది.  ‘30 ఏండ్లనాడు మీ తాత కత్తి పట్టినాడంటే అది అవసరం.. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం.. అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డనాటికి లోపం అయితందా’ అని ఎన్టీఆర్‌తో ఆయన బామ్మ చెప్పే డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.

‘సర్‌ వంద అడుగుల్లో నీరు పడుతుంది అంటే 99 అడుగుల వరకు తవ్వి ఆపేసే వాడిని ఏమంటారు? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం సర్‌. తవ్వి చూడండి’ అంటూ ఎన్టీఆర్‌ చివర్లో భావోద్వేగంతో అనే మాటలు ఆకట్టుకున్నాయి.

Aravindha Sametha Theatrical Trailer | Jr. NTR, Pooja Hegde | Trivikram | Thaman S