టెక్ ప్రపంచం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ రానే వచ్చింది. అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ యాపిల్ తన తొలి ఫోల్డబుల్ డివైజ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనితో పాటు శక్తివంతమైన ఫీచర్లతో ఐఫోన్ 18 ప్రో మోడల్స్‌ను కూడా లాంచ్ చేశారు.
మొట్టమొదటి ఫోల్డబుల్ ‘ఐఫోన్ డ్యూయో’ ప్రత్యేకతలు:
రంగులు: ఇది ప్రధానంగా రెండు రంగుల్లో (స్టార్ వైట్, నైట్ స్కై) లభ్యం కానుంది.
డిస్‌ప్లే & డిజైన్: మడత విప్పినప్పుడు ఇది అత్యంత పల్చని ఐఫోన్‌గా మారుతుంది. దీనికోసం ఐఓఎస్ 27 (iOS 27) ను ప్రత్యేకంగా రీడిజైన్ చేశారు.
పెద్ద స్క్రీన్ అనుభూతి: దీనిలో 7.6 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్డీఆర్ డిస్‌ప్లే (మడత తీసినప్పుడు) ఉంటుంది. దీని ద్వారా రెండు హోమ్ స్క్రీన్ పేజీలు, మెయిల్, మెసేజెస్ వంటి కంటెంట్‌ను ఒకేసారి పక్కపక్కనే రెండు యాప్‌లుగా వియోగించుకోవచ్చు.
మడతపెట్టినప్పుడు: ఫోన్ మడతపెట్టినప్పుడు బయట 5.4 అంగుళాల బెడ్‌సైడ్ క్లాక్ (విడ్జెట్స్, వెదర్, క్యాలెండర్, మ్యూజిక్) ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.
ఐఫోన్ 18 శ్రేణి మోడల్స్, స్టోరేజ్ వేరియంట్లు & ధరల వివరాలు:
1. ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro)
256 జీబీ: రూ. 1,64,900
512 జీబీ: రూ. 1,89,900
1 టీబీ: రూ. 2,39,900
2 టీబీ: రూ. 3,14,900
2. ఐఫోన్ 18 ప్రో మాక్స్ (iPhone 18 Pro Max)
256 జీబీ: రూ. 1,79,900
512 జీబీ: రూ. 2,04,900
1 టీబీ: రూ. 2,54,900
2 టీబీ: రూ. 3,29,900
3. ఐఫోన్ డ్యూయో – ఫోల్డబుల్ (iPhone Duo)
256 జీబీ: రూ. 2,99,900
512 జీబీ: రూ. 3,24,900
1 టీబీ: రూ. 3,74,900
2 టీబీ: రూ. 4,49,900
