పంచారామ క్షేత్రాలలో ప్రధానమైనది, దేవతల రాజైన దేవేంద్రునిచే ప్రతిష్ఠించబడినది అమరారామం, నేటి అమరావతి. ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ బాలచాముండేశ్వరీ సమేత అమరేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమరేశ్వరాలయము పవిత్ర కృష్ణానదీ తీరాన మూడు ప్రాకారములతో నిర్మించబడినది.