గరుడ పంచమి లేదా నాగ పంచమి ప్రాముఖ్యత ఏమిటి ??

ఏటా శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి లేదా గరుడ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు ఆదిశేషుని అనుగ్రహించిన రోజే ఈ నాగపంచమి.

నాగులచవితి లాగనే నాగ పంచమి రోజు కూడా నాగ దేవతలను ఆరాధించడం వల్ల సంవత్సరం పొడవునా ఎలాంటి అవరోధాలు/సమస్యలు లేకుండా జీవించుచున్నది భక్తుల నమ్మకం.

పురాణాలలో పురాణాలలో ఈశ్వరుడు కూడా పార్వతీ దేవికి ఈ నాగపంచమి విశిష్టతను తెలిపినట్లు ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. కావున శ్రావణ మాస శుద్ధ పంచమి రోజున నాగారాధన చేయడం ఎంతో మంచిది. శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు.