మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ రూపొందిస్తున్న చిత్రం ‘అ ఆ’ ఈ చిత్రం అఫీషియల్ టీజర్ రిలీజైంది. ‘మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం నుండి జాలువారిన ఒక మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ చిత్రాన్నిప్రేక్షకులు మే లో చూడబోతున్నారు, మిక్కీజె. మేయర్ సంగీతం సంగీత ప్రియులను అలరిస్తుం దని అన్నారు. ఏప్రిల్ మొదటివారంలో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. మరోవైపు చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 6 న చిత్రాన్ని విడుదల చేయనున్నామని అని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ సందర్భం గా తెలిపారు.
త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ సమంతనాయికగా నటిస్తున్నారు. మరో కధానాయిక గా ‘ అనుపమ పరమేశ్వరన్’ (మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ఫేం) నటిస్తున్నారు. చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో .. నదియ, అనన్య, ఈస్వరీరావు, సన, గిరిబాబు, నరేష్, రావురమేష్ , పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి లు నటిస్తున్నారు.