స్వతంత్ర భారతమా? ఖండిత భారతమా?

వేద కాలం నుండి లక్షలాది సంవత్సరాలుగా మన మాతృభూమి అయిన భారతదేశం యొక్క భవ్యమైన స్వరూపం ఇది బృహస్పతి ఆగమ శాస్త్రంలోను విష్ణుపురాణంలోను కాళిదాసు, ఆచార్య చాణుక్యుని రచనలలోనూ మన దేశపు ఎల్లలు గురించి స్పష్టంగా వర్ణించబడి ఉంది.

ఇస్లాం మతం పుట్టిన తర్వాత ముస్లిం దురాక్రమణ కారులు తాము ఆక్రమించిన ప్రతిచోట ప్రజల సంస్కృతిని, దేవాలయాలను ఇతర శ్రద్దా కేంద్రాలను నాశనం చేసి ప్రజలందరినీ బలవంతంగా ముస్లింలుగా మార్చారు. ఆవిధంగా ముస్లింల ఆధిపత్యంతో క్రీ.శ. 1709 లో అఖండ భారతం నుండి గాంధార రాజ్యాన్ని చీల్చుతూ ఆఫ్ఘనిస్తాన్ పేరుతో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పర్చారు.

మనదేశంలో బ్రిటిష్ పాలన ప్రారంభమైన తర్వాత “విభజించి పాలించు” అన్న కుటిల నీతి లో భాగంగా 1912లో శ్రీలంకను, 1937లో బర్మా (బ్రహ్మ దేశం)ను భారతదేశం నుండి విడదీసింది. 1947 ఆగస్టు 14 వ తేదీన బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని ఇండియా, పాకిస్తాన్లుగా చీల్చి అదే రోజున పాకిస్తాన్(సింధు దేశం)కు స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది. ఆ మర్నాడు ఆగస్టు 15న ఖండిత భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది.

అదే సమయంలో నేపాల్, భూటాన్ లు కూడా స్వతంత్రరాజ్యాలుగా ఏర్పడ్డాయి. అప్పటికి టిబెట్ భారతీయ సంస్కృతితో స్వతంత్ర దేశంగా మన దేశ రక్షణలో ఉంది. కొన్ని వందల వేల సంవత్సరాలుగా టిబెట్ బౌద్ధ మతం అధికార మతం గాను హిందూ సంస్కృతి జీవన విధానం గాను గాను భారత దేశ రక్షణ లో తటస్థ దేశంగా ఉంది. భారతదేశ ఉదాసీన, నిర్లక్ష్య వైఖరిని ఆసరా చేసుకుని చైనా, టిబెట్ ప్రాంతం మొత్తాన్ని 1960 నాటికి ఆక్రమించు కుని తన దేశంలో కలుపుకుంది. తర్వాత కాలంలో భారత ప్రభుత్వం కూడా విలీనాన్ని అంగీకరించి ధృవీకరించారు.

1947లో స్వాతంత్ర్యం ప్రకటించిన రెండు నెలలకే పాకిస్తాన్, జమ్మూకాశ్మీర్ లోనికి చొచ్చుకొని వచ్చి 75 వేలచ.కి.మీ భూభాగాన్ని ఆక్రమించుకొని తన స్వాధీనంలో ఉంచుకుంది. 1962 లో చైనా, భారతదేశం పై దురాక్రమణ జరిపి జమ్మూ కాశ్మీర్లోని లడక్ ప్రాంతంలో 37, 550 చ.కి.మీ భూభాగం ఆక్రమించుకుంది.