ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ప్రస్తుతం స్పెయిన్ లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా అక్కడే షూటింగ్ చేస్తున్న ఎన్టీఆర్ అండ్ టీమ్ ని అక్కడి మీడియా ఓ మారు పలకరించింది. నేరుగా షూటింగ్ స్పాట్ లోకి ఎంటరయిపోయి సుకుమార్, రకుల్, ఎన్టీఆర్ లతో ఊసులు కలిపింది. సుకుమార్ తో సంభాషించిన సదరు మీడియా వ్యాఖ్యాత మీ సినిమాలో నాకో పాత్ర ఇస్తారా అని అడిగాడు. మరి కొద్ది రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ పూర్తికానుంది. సంక్రాంతికి ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ విడుదలకానుంది.