నాగార్జున, లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’. కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో నాగ్ ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. యాంకర్ అనసూయ నాగార్జున మరదలిగా కనపడనున్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదల చేయాలని తొలుత అనుకున్నా ఇప్పుడు సంక్రాంతి పండగకి ఫిక్స్ చేశారు. రాధామోహన్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా జనవరి 15న తెరమీదికి రానుంది.