శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూప శ్రీ త్రికోటేశ్వర స్వామి (కోటప్పకొండ)

శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూప శ్రీ త్రికోటేశ్వర స్వామి (కోటప్పకొండ)

జిల్లా: గుంటూరు
రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్

భారతదేశంలో సుప్రసిద్ద శైవక్షేత్రాలలో కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారి దేవాలయం ఒకటి.  కోటప్పకొండ  గుంటూరుజిల్లా  నరసరావుపేట సమీపంలోవుంది.    ఈ దేవాలయంను భక్తులు సంవత్సరం పొడవునా సందర్శిస్తూనే వుంటారు.  ప్రతి సంవత్సరం “మహాశివరాత్రి”  రోజున కోటప్పకొండ తిరుణాళ్ళ వైభవంగా జరుగుతుంది.  కోటప్పకొండ  తిరుణాళ్ళని  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్ర పండుగగా గుర్తించినది.  కోటప్పకొండ ఉండే కొండను ఏవిధంగా చూసిన మూడు శిఖరాలుగా కనిపిస్తాయి. వీటికే బ్రహ్మ, విష్ణు మరియు రుద్ర అని పేర్లు. కాబట్టి కొండపై వెలసిన దేవుణ్ణి త్రికూటేశ్వరుడు అని, ఈ ప్రదేశాన్ని త్రికూటాచలమని పిలుస్తారు.

స్తలపురాణం :  తన తండ్రి తలపెట్టిన  దక్షయజ్ఞనికి ఆహ్వనము లేకుండా వెళ్ళిన సతీదేవి అక్కడ శంకరునికి జరిగిన అవమాననికి యోగగ్ని దూకి స్వదేహన్ని భస్మం చేసుకుంది. కోపితులైన రుద్రగణాలు(పార్వతీ దేవీ రక్షకులు) యాగాలు విధ్వంసం చేయసాగారు.  భృగుమహార్షి మంత్రాల ద్వార యగాన్ని సంరక్షించారు. సతీదేవి యోగగ్నిలో  భస్మమై పోయిన వార్తను రుద్రగణాలు శంకర భగవానునికి విన్నవించారు. ఆ వార్తను విన్న శంకర భగవానుడు భయంకరమైన కోపంతో తన శిరస్సు నుండి ఒక జటను బెరికి రోషంతో గిరిశిఖరంపై విసిరికొట్టాడు. ఆ జట ఒక భాగం నుండి వీరభద్రుడు ప్రళయాగ్ని సమంగా మహొన్నత కాయుడై, సహస్రబాహువులతో ప్రజ్వరిల్లుతుండగా, మరో జట నుండి మహకాళి అత్యంత భయావహంగా అవతరించింది.

      శంకర భగవానుడి ఆదేశించగా వీరభద్రుడు దక్షవాటికలో ప్రవేశించి దక్షయజ్ణాన్ని విధ్వంసం చేసి, ద్కుని సిరస్సుని ఖండింపచేసి, యాగకుండ ప్రజ్వలితాగ్నిలో విసిరివేశాడు. యోగగ్నిలో  భస్మమై పోయిన సతీదేవి పార్ధివదేహాన్ని

వాయు మార్గం:-  కోటప్పకొండ కు సమీపాన గల విమానాశ్రయం గన్నవరం (విజయవాడ) విమానాశ్రయం. విజయవాడ కోటప్పకోండకు 95 కి. మీ. దూరంలో ఉన్నది. విజయవాడ నుంచి ప్రవేట్ వాహనాల మీద కానీ, క్యాబ్ ద్వారా కానీ ఇక్కడికి చేరుకోవచ్చు

రైలు మార్గం:- కోటప్పకొండ కు సమీపాన నరసరావుపేట రైల్వే స్టేషన్ ఉంది. ఇది 11 కి. మీ. దూరంలో ఉన్నది. గుంటూరు లేదా విజయవాడ వెళ్లే రైళ్లాన్ని ఇక్కడే ఆగుతాయి. కనుక నరసరావుపేట వద్ద దిగి, బస్సు ద్వారా కానీ, ఆటో లేదా ఇతర వాహనా ల మీద గాని ఎక్కి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం:- కోటప్పకొండ కు విజయవాడ లేదా గుంటూరు లేదా నరసరావుపేట లేదా చిలకలూరిపేట ఊర్ల నుండి ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి. కొండ మీదకి చేరుకోవడానికి కొండ కింది నుంచి బస్సులను దేవస్థానం వారు నడుపుతుంటారు.