విండోస్‌ వినియోగదారులంతా తమ కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి

ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో తీవ్ర లోపం బయటపడటంతో వినియోగదారులంతా తమ కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని దిగ్గజ టెక్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ కోరింది.

సాధారణంగా ఒకే ప్రింటర్‌ను ఎక్కువమంది ఉపయోగించుకునేందుకు విండోస్‌లో ‘ప్రింట్‌ స్పూలర్‌’ ఉపయోగపడుతుంది. అందులో భద్రత పరమైన లోపాలున్నట్లు తాము గుర్తించామని సాంగ్‌ఫర్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ పరిశోధకులు ఈ ఏడాది మేలో తెలిపారు. దాన్ని ఎలా హ్యాక్‌ చేయొచ్చన్న వివరాలను పొరపాటున వారు ఆన్‌లైన్‌లో ప్రచురించారు. వెంటనే డిలీట్‌ చేసినప్పటికీ.. ఆ లోపే కొన్ని డెవలపర్‌ సైట్లలోకి సదరు సమాచారం చేరింది. ‘ప్రింట్‌నైట్‌మేర్‌’గా పిలుస్తున్న ఈ లోపాన్ని ఉపయోగించుకొని హ్యాకర్లు వివిధ ప్రోగ్రామ్‌లను ఇతరుల కంప్యూటర్లలో ఇన్‌స్టాల్‌ చేసే ముప్పుందని గ్రహించిన మైక్రోసాఫ్ట్ బయటపడ్డ లోపాలనూ అధిగమించేలా అప్‌డేట్‌ను అందించింది. విండోస్‌-10తో పాటు విండోస్‌-7లోనూ ఈ లోపం ఉందని తెలిపింది. వాటికోసం అప్‌డేట్‌లను విడుదల చేసింది. విండోస్‌-7కు తమ సపోర్ట్‌ను మైక్రోసాఫ్ట్‌ గత ఏడాదే సపోర్ట్ ఆపిన అప్పటికిని, బగ్ తీవ్రత దృష్ట్యా విండోస్ 7 కి కూడా అప్డేట్ నీ అందించింది