రూ.2,000 తగ్గింపుతో ఎంఐ 10టీఎంఐ 10టీ

రూ.2,000 తగ్గింపుతో ఎంఐ 10టీఎంఐ 10టీ…

షియోమీ తన ఎంఐ 10టీ ప్రో స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపును అందించింది. ఈ ఫోన్ ధరను రూ.2,000 తగ్గించింది. గతేడాది లాంచ్ అయిన ఈ ఫోన్‌లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.39,999గా ఉంది. ఇప్పుడు రూ.2,000 తగ్గింపుతో రూ.37,999కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు అరోరా బ్లూ, కాస్మిక్ బ్లాక్, లూనార్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఎంఐ 10టీ ప్రో పనిచేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేనే అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గానూ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇందులో కూడా ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.