ముంబయి జుహు బీచ్‌లో జెల్లీఫిష్‌ల దాడి.. 150మందికి గాయాలు

ముంబయి జుహు బీచ్‌లో జెల్లీఫిష్‌ల దాడి.. 150మందికి గాయాలు

ముంబయి బీచ్‌ల వద్దకు పెద్ద మొత్తంలో బ్లూ బాటిల్‌ జెల్లీఫిష్‌లు వచ్చి చేరడంతో ముంబయి వాసులు అటు వైపు వెళ్లేందుకు భయపడిపోతున్నారు. సాధారణంగా వర్షాకాలం మధ్యలో ఇలాంటి జెల్లీఫిష్‌లు కనపడుతూ ఉంటాయి. అయితే ఈసారి ఎక్కువ మొత్తంలో వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ జెల్లీఫిష్‌ల కారణంగా దాదాపు 150 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ బ్లూ బాటిల్‌ జెల్లీఫిష్‌లు కరవడం వల్ల మనుషుల ప్రాణాలకేమీ ప్రమాదం ఉండదు కానీ కొన్ని గంటల పాటు తీవ్రమైన నొప్పి, దురద ఉంటాయట. గత రెండ్రోజులుగా బీచ్‌లలో జెల్లీఫిష్‌లు ఎక్కువయ్యాయని, దాదాపు150 మందిపై దాడి చేశాయి.