బాల దర్శకత్వంలో రానా ??

రానా హీరోగా ఎంట్రీ ఇచ్చాడే గానీ నటుడిగానే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2013లో వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుం’ రానా హీరోగా నటించిన చివరి చిత్రం. తర్వాత పలు బాలీవుడ్, తమిళ్ సినిమాల్లో గెస్ట్ రోల్స్, ఇతరపాత్రలు చేస్తూ వచ్చిన రానా బాహుబలి సినిమాతో భల్లాలదేవుడిగా కెరీర్‌లో నిలిచిపోయే పాత్రలో నటించాడు. శివపుత్రుడు,  వాడు వీడు లాంటి సినిమాల్ని తెరకెక్కించిన బాల దర్శకత్వంలో రానా ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. తమిళ నటులు ఆర్య, విశాల్, అరవింద్ స్వామి, అధర్వ వంటి భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందనుంది.