బాలయ్య 100వ సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలు అందుకోన్న ఈ ఇద్దరి కలయికలో హాట్రిక్ హిట్ వస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య 100వ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ టైటిల్ బాలయ్య ఇమేజ్ కు పర్ ఫెక్టుగా సూటయ్యే విధంగా ఉందని, దీన్నే ఫిక్స్ చేయాలని అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం బాలయ్య తన 99వ సినిమా ‘డిక్టేటర్’ షూటింగులో ఉన్నారు. మరో వైపు బోయపాటి బన్నీతో ‘సరైనోడు’ చేస్తున్నారు. ఇద్దరి ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ‘గాడ్ ఫాదర్’ పట్టాలెక్కనుంది. ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.