బాలీవుడ్లో ఆఫర్లు రాకపోడంతో మళ్ళీ సౌత్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేసిన ఇలియానాకి, అనుకోకుండా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో రామ్ చరణ్ కి జోడీగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఇలియానా నటించబోతుందట. అలాగే తమిళంలోనూ ఇళయదళపతి విజయ్ కొత్త సినిమాలో హీరోయిన్‌గా ఇలియానా ఎంపిక అయ్యిందట. లేటెస్ట్‌గా ఇలియానాకి తెలుగులో మరో మంచి ఆఫర్ వచ్చిందట. బాలక్రష్ణ 99వ సినిమా డిక్టేటర్‌లో ఇలియానా కనిపించబోతుందట. సినిమాలో హైలైట్ గా నిలిచే ఐటమ్ సాంగ్ కి ఇలియానానే ఫిక్స్ చేశాడట బాలయ్య. ఇప్పటికే అంజలీ, సోనాల్, అక్ష హీరోయిన్లుగా నటిస్తున్న డిక్టేటర్‌లో ఇలియానా కూడా కనిపించనుండటంతో ఫ్యాన్స్‌లో అంచనాలు ఎక్కువయ్యాయి.