బస్సుల్లో.. రైళ్ళల్లో ప్రయాణిస్తే.. సన్నబడతారా..?

శరీరంలో కొవ్వు కరిగించుకొని సంనబడాలి అనుకుంటే.. సింపుల్ పద్దతి ఉన్నదట. ఆఫీసులకు వెళ్ళే సమయంలో తమ సొంతవాహనాలైన మోటార్ సైకిల్, కార్లను ఉపయోగిస్తుంటారు. అయితే, సొంత వాహనాలను పక్కన పడేసి.. బస్సుల్లో.. రైళ్ళల్లో ప్రయాణిస్తే.. ఉబకాయం తగ్గిపోతుందట. ఇంటి దగ్గరి నుంచి… బస్ స్టాప్ వరకు.. అలాగే.. రైల్వే స్టేషన్ వరకు నడిచి వెళ్ళడం.. అలాగే రైళ్ళు బస్సుల్లో.. ఒంటరిగా ఉండరు కాబట్టి.. కొత్త కొత్త వ్యక్తులు ఉంటారు కాబట్టి.. వారితో పరిచయాలు పెంచుకొని.. మాట్లాడటం వలన ఉబకాయంతో పాటు షుగర్, బిపి వంటివి కూడా తగ్గుతాయని ఇటీవలే జపాన్ కు చెందిన ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తెలిసింది. జపాన్ లో ఉబకాయంతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. వారిపై ఓ సంస్థ పరిశోధన చేసి.. పై వివరాలను వెలువరించింది.