పొంగల్ బరిలో నయనతార నటించిన రెండు సినిమాలు
తమిళనాట వరుస విజయాలతో దుమ్మురేపుతోంది నయనతార. కెరీర్ ప్రారంభించి పదేళ్లు దాటినా.. ఎప్పటికప్పుడు తన అందాలకు మెరుగులు దిద్దుతూ కుర్ర హీరోయిన్స్‌కు గట్టి పోటీనిస్తోంది. ఈ ఏడాది నయన్ తమిళంలో మొత్తం ఐదు సినిమాల్లో నటించగా.. అందులో మూడు సినిమాలు వరుసగా భారీ విజయాలను అందించాయి. తని ఒరువన్, మాయ, నానుమ్ రౌడీ దాన్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన నయన్.. వచ్చే ఏడాది పొంగల్ బరిలో తనకు తానే పోటీ అంటోంది. నయన్-శింబు జంటగా నటించిన ఇదు నమ్మ ఆళు చిత్రంతో పాటు జీవాతో రొమాన్స్ చేసిన తిరునాళ్ కూడా సంక్రాంతికే విడుదల కానుంది. దీంతో.. తమిళనాట పొంగల్‌కు రెండు సినిమాలతో నయన్ సెంట్రాఫ్ అట్రాక్షన్ అవబోతోంది. హ్యాట్రిక్ హిట్స్‌తో జోరుమీదున్న నయన్‌కు ఈ పొంగల్‌తో మరో రెండు విజయాలు లభిస్తాయేమో చూడాలి..!