పూర్వపు ”అమరావతి” నగర నిర్మాత వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు..

అమరావతి అమరేశ్వరాలయ నిర్మాత రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు వారసులు ఆలయం ఎదుటతమ జమింధారీ వారసులు నివసించేందుకు వీలుగా ఒక ఆధునాత భవనం నిర్మించుకున్నారు. 1945లో ఈ భవనం నిర్మితమైంది అప్పట్లో ఈ భవనం కట్టేందుకు దాదాపు రెండేళ్ళు సమయం పట్టింది. సినిమాల్లో చూపించే జమీందార్ల బంగ్లాలా ఇధి అత్యంత అద్భుతం గా ఉంటుంది. ఏళ్లు గడుస్తున్నా ఆ భవనం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అప్పట్లో రాజా గా ఉన్న రాజా వాసిరెడ్డి బాల చంద్రశేఖర వరప్రసద్ దీన్ని నిర్మించారు. దీనికి మహేంద్రాలయం అని నామకరణం చేసారు. ఇప్పుడు ఇందులో రాజావారి ఏడొతరం వారసులు ఉంటున్నారు. రాజావార్లు వారి సంస్థానంలో ఉపయోగించిన అనేక వస్తువులు భద్రం గా ఉన్నాయి. తలుపుల దగ్గరనుండి లాంతర్లు, డైనింగ్ టేబల్ రాజా వారు వినియోగించిన పల్లకి, కుర్చీ, వారి తరతరాల చిత్రపటాలు, ఇతర వస్తువులు అప్పటి కాలాన్ని ప్రతిబింబిస్తాయి. పుష్కరాల సమయం లో అమరావతి ఆలయ నిర్మాత రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు గృహం, అందులోని వస్తువులు విశేషాలను పాటకుల కోసం రాజా వారి ఏడొతరం వారసుడు శ్యామ్ ప్రసాద్, నిషిత ప్రసాద్ దగ్గరుండి వివరించారు.