పవిత్ర సోమవారం.. శ్రావణమాసంలో శివుడికి పూజా విధానం

శ్రావణ మాసంలో ఆదిదేవుడైన మహాశివుని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా శ్రావణ సోమవారం రోజు పూజ చేస్తే ఎంతో పుణ్యఫలం అందుతుంది అంటారు

ఈ సంవత్సరం ఆగస్టు 9న ప్రారంభమయ్యే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఎంతో ఫలితం ఉంటుందని, అలాగే శ్రావణ సోమవారం రోజు పరమేశ్వరుని పూజించడం వలన జన్మ జన్మల పుణ్య ఫలాలు పొందవచ్చని భక్తుల విశ్వాసం. సోమవారం శివునికి అభిషేకం చేస్తూ కనిపిస్తారు.

తేనెతో అభిషేకం : శ్రావణ మాసంలో పరమేశ్వరుని తేనెతో అభిషేకం చట్టం వలన ఆరోగ్యం సరిగా లేని వారికి ఆరోగ్యం మరియు సంపద కూడా పెరుగుతుందని పండితులు చెబుతుంటారు.

నీటితో అభిషేకం : పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు నీటితో అభిషేకం చేసిన మహా ఆనందం పొంది ముక్తిని ప్రసాదిస్తాడు అని పెద్దలు చెప్తూ ఉంటారు. శివలింగంపై బిల్వపత్రం ఉంచి నీటితో అభిషేకించిన వలన ఆయురారోగ్యాలతో ఉండటమే కాకుండా అనేక బాధ బాధలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉంటారు.

చెరకు రసంతో అభిషేకం: చెరుకు రసాన్ని శివలింగంపై మెల్లగా పోస్తూ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ…. అనే మంత్రాన్ని జపించిన వారికి అప్పుల బాధలు రుణ విముక్తి కలిగి సిరి సంపదలు పొందవచ్చునని పండితులు చెప్తూ ఉంటారు.

పాలతో అభిషేకం: సంతానభాగ్యం లేక బాధపడుతున్నవారు శివుని పాలతో అభిషేకించడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుందని శివపురణంలో చెప్పబడింది. ఆ లతో శివునికి అభిషేకించడం తో పాటు పేదవానికి దానధర్మాలు కూడా చేయాలి.

పాలల్లో పంచదార కలిపి అభిషేకం: పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు, స్వామివారిని ఎంత పూజిస్తే అంత వరాలిచ్చే శంకరుడు, శ్రావణ మాసంలో పరమేశ్వరుని పాలు పంచదార కలిపి అభిషేకించడం వలన ఎన్నో పుణ్యఫలాలను పొందవచ్చునని పండితులు చెబుతుంటారు ఇలా అభిషేకించడం వలన ముఖ్యంగా శత్రుభయం రుణ బాధలు తొలగిపోతాయి.