నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా ?

నెయ్యి తింటే కొవ్వు ఎక్కువ అవుతుందని, అరగదనీ, రకరకాల అపోహలు ఉన్నాయ్‌

  • నెయ్యిలో అత్యవసర అమైనో ఆమ్లాలుంటాయ్‌. వీటి కారణంగా రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వులు కరుగుతాయి. కాబట్టి అనవసర కొవ్వు పెరుగుతుందనేది అపోహ మాత్రమే!
  • కొంతమంది నెయ్యి తింటే అరగదనీ తినడం మానేస్తారు. కానీ నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్‌ ఉండటం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఆయుర్వేదం ప్రకారం నెయ్యి మనలో సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుంది. ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతతను చేకూరుస్తుంది.
  • ఇందులో ఉండే యాంటీ ఫంగల్‌, యాంటీవైరస్‌ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కీళ్ల నొప్పులు కూడా మాయమవుతాయి.