నాని చేతిపై ‘జై బాలయ్య’ టాటూ
ఇటీవలే ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో హిట్టు కొట్టిన నాని‘సైజ్ జీరో’ మూవీ ప్రీమియర్ షోకు హాజరైన నాని తన చేతిపై ‘జై బాలయ్య’ టాటూతో కనిపించారు. తాజాగా ‘అందాల రాక్షసి’ ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాని బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా నటించబోతున్నాడు. సినిమాలో ఆయన చేతిపై జై బాలయ్య అనే టాటూతో కనిపిస్తారు. బాలయ్యతో ‘లెజెండ్’ లాంటి బ్లాక్బస్టర్ తీసిన 14 రీల్స్ వాళ్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.