నందమూరి బాలకృష్ణ డిక్టేటర్ దీపావళి శుభాకాంక్షలు

నందమూరి బాలకృష్ణ హీరోగా  అంజలి, సోనాల్ చౌహన్, అక్ష హీరోయిన్లుగా శ్రీవాస్ తెరకెక్కిస్తున్న చిత్రం డిక్టేటర్. నాయక చవితి మొదలు ప్రతి పండక్కి కొత్త పోస్టర్లతో, పాటలతో డిక్టేటర్ అభిమానులకి శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నాడు. తాజాగా మరో కొత్త పోస్టర్ విడుదల చేసి దీపావళి శుభాకాంక్షలు అందజేశాడు. ఈరోస్ ఎంటర్టైన్మెంట్, వేధాశ్వ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటివరకు ఇచ్చిన కానుకలన్నిటినీ మించి సంక్రాంతికి అతి పెద్ద కానుకగా డిక్టేటర్ సినిమాని అభిమానులకు ఇవ్వనున్నారు బాలయ్య.