అమరావతి సినిమాతో విలన్‌గా ప్రయత్నాలు చేసిన హీరో తారకరత్న మరోసారి నెగిటివ్ రోల్ చేసేందుకు తారకరత్న సిద్ధమయ్యాడు. నారా రోహిత్ హీరోగా ప్రదీప్ అనే యువ దర్శకుడు తెరకెక్కించబోయే ‘రాజా చేయి వేస్తే’ సినిమాలో తారకరత్న విలన్‌గా నటించనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. దీంతో పాటు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రోహిత్ హీరోగా ‘జ్యో అచ్యుతానంద’ అనే మరో సినిమాకీ నిర్మాత ఆయనే.