భారత డ్రైవింగ్ లైసెన్స్ తో ఏ ఏ దేశాల్లో డ్రైవింగ్ చేయవచ్చు

వెకేషన్ కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు, సొంత డ్రైవింగ్లో ప్రకృతి అందాలు చూస్తే ఆ కిక్కే వేరు.

చాలా దేశాల్లో టూరిస్ట్ వీసా లేదంటే విజిట్ వీసా తోనో వెళ్ళినప్పుడు మనం డ్రైవింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కానీ కొన్ని దేశాలు మాత్రం ఇండియాలో మనం తీసుకున్న లైసెన్స్ తోనే  డ్రైవింగ్ చేసే వెసులుబాటు ఇచ్చాయి. ఇప్పుడు ఆదేశాలు ఏవేవో తెలుసుకుందాం.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 దేశాలు ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌ను అనుమతిస్తున్నాయి. ఆ దేశాల జాబితాలో జర్మనీ, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, సౌతాఫ్రికా, స్వీడన్, సింగపూర్, హాంగ్ కాంగ్, మలేషియా దేశాలు ఉన్నాయి. ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌ను చూపించి జర్మనీ రోడ్లపై దాదాపు ఆరు నెలలపాటు వాహనాలను డ్రైవింగ్ చేయొచ్చు. అదే యూకేలోని ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్‌ ప్రాంతాల్లోని అధికారులు ఏడాది పాటు ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌ను అనుమతిస్తారు. ఆస్ట్రేలియాలో కేవలం మూడు నెలలపాటు మాత్రమే ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌ను అనుమతిస్తారు. తర్వాత అక్కడి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.